Kamareddy Floods : కామారెడ్డి జిల్లాను బుధవారం భారీ వర్షం కకావికలం చేసింది. తెల్లవారుజామున 3 గంటల నుంచి వాన ఏకధాటిగా కురిసింది. కామారెడ్డి పట్టణంతోపాటు రాజంపేట, భిక్కనూరు, దోమకొండ మండలాల్లో జనజీవనం స్తంభించింది. రాజంపేట మండలంలోని ఆర్గొండ గ్రామంలో 24 గంటల్లో అత్యధికంగా 44 సెం.మీ. వర్షపాతం నమోదైంది. మరికొన్ని మండలాల్లో 20 సెం.మీ. మేర వర్షం కురిసింది. కామారెడ్డి పట్టణంలోని పెద్దచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహించడంతో హైదరాబాద్‌కు వెళ్లే మార్గంలోని పైవంతెన మీది నుంచి నీరు ప్రవహించింది. సిరిసిల్ల మార్గంతోపాటు నిజాంసాగర్ మార్గంలోనూ రోడ్లు ధ్వంసమవడంతో పట్టణానికి మూడు వైపులా రాకపోకలకు ఆటంకం కలిగింది. పెద్దచెరువు అలుగుతో కిందనున్న జీఆర్ కాలనీలో ఇళ్లలోకి నీళ్లు చేరాయి. పదుల సంఖ్యలో కార్లు, ద్విచక్రవాహనాలు కొట్టుకుపోయాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితిపై వన్ ఇండియా గ్రౌండ్ రిపోర్ట్

Kamareddy district witnessed torrential rains on Wednesday, bringing life to a standstill. From 3 AM onwards, continuous downpour lashed the region, causing heavy damage in Kamareddy town, Rajampet, Bhikkanur, and Domakonda mandals.

👉 Key Highlights:

Argonda village (Rajampet mandal): Recorded 44 cm rainfall in 24 hours – the highest in the district.

Several other mandals recorded 20 cm rainfall.

Pedda Cheruvu stream overflowed, flooding the flyover on the Hyderabad route.

Roads leading to Siricilla & Nizamsagar were damaged, cutting off access from 3 sides of Kamareddy town.

JR Colony submerged as floodwaters entered houses.

Dozens of cars & two-wheelers washed away in the floodwaters.

📌 This is a OneIndia Ground Report from Kamareddy, bringing you on-the-spot updates about the flood situation.

#Kamareddy #KamareddyFloods #Telangana #HeavyRains #KamareddyFloodUpdate #OneIndia #GroundReport #OneindiaTelugu #OIUpdates

~PR.358~VR.240~VR.232~VR.238~HT.286~